డిటెక్టివ్ చంద్రశేఖర్ 2

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

(ఈ రోజు అప్డేట్ లో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి)

శేఖర్ హైదరాబాద్ కీ తిరిగి రాగానే తన ఇంటికి వెళ్లాడు అక్కడ యాక్టింగ్ స్కూల్ లో మొత్తం హడావిడిగా ఉంది అందరూ పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకోని లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు అమ్మాయిలు అంతా ఒక చోట చేరి కోరస్ పడటం మొదలు పెట్టారు జేమ్స్ అందరి ముందు పేపర్ పట్టుకొని చెయ్యి ఆడిస్తూ పాటలు పాడిస్తున్నాడు

“Forgive us, O lord, we acknowledge ourselves as type of common man,

Of the women and men who shut the door and sit by the fire,

Who fear the blessing of God, The loneliness of night of God, the surrender required, The depreviation inflicted” అని పాడుతూ ఉన్నారు అప్పుడు జేమ్స్ సైగ చేయగానే థామస్ ఒక చర్చి ఫాదర్ లాగా డ్రస్ వేసుకొని స్టేజ్ మధ్యలోకి వచ్చాడు అప్పుడే తన చుట్టూ కత్తులు పట్టుకుని నలుగురు సేనాధిపతులు నిలబడి ఉన్నారు.

“It is not in time that my death shall be known;

It is out of time that my decision is taken

If you that is decision

To which my whole being gives entire consent

I give my life to the law of God above the law of man” అని తన డైలాగ్ చెప్పాడు థామస్ అదే సమయంలో ఆ నలుగురు తమ కత్తులతో అతని పొడిచి చంపారు ఆ తర్వాత తెర కిందకు దిగింది అప్పుడు శేఖర్ గట్టిగా విజిల్ వేసి చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు శేఖర్ నీ చూసిన జేమ్స్ అందరిని వెళ్లిపోమని చెప్పాడు.

జేమ్స్ దగ్గరికి వచ్చిన శేఖర్ “అబ్బ అబ్బా ఏమీ యాక్టింగ్ సార్ మీ అబ్బాయి చించేశాడు అసలు ఏమీ జరుగుతోంది సార్” అని అడిగాడు దానికి జేమ్స్ “లండన్ లో వచ్చే నెల లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్లు ప్రతి సంవత్సరం చేసే డ్రామా ఈవెంట్ కీ ఈ సారి మా స్కూల్ నీ కూడా ఎంపిక చేశారు అందుకే నేను కాలేజీ లో చదివే రోజుల్లో చదివిన ఒక పాఠం నీ డ్రామా గా మార్చి ఇప్పుడు అక్కడ ప్రదర్శించబోతున్నాము” అని చెప్పాడు జేమ్స్, దానికి శేఖర్ “ఓహ్ కంగ్రాట్స్ సార్ మొత్తానికి అనుకున్నది సాధించారు ఇంతకీ ఈ డ్రామా పేరు ఏంటి సార్ ” అని అడిగాడు దానికి ఆయన “మర్డర్ ఇన్ చర్చ్” అని చెప్పాడు అది విని శేఖర్ “అదేమి కథ సార్ ” అని అడిగాడు దానికి జేమ్స్ నవ్వుతూ “ఈ కథ లో మంచికి చెడుకు మధ్య జరిగే ఆధిపత్య పోరు గురించి ఒక మంచి అనేది ఒక గది మధ్యలో ఉంటే నాలుగు దిక్కులో చెడు వేచి ఉంటుంది చావు పుట్టుక మధ్య నీ ధర్మం నువ్వు సరిగ్గా నిర్వర్తించావా లేదా అని నిన్ను ప్రశ్నించుకోక పోయిన నీ ప్రతి కదలికలు దేవుడు మాత్రం ప్రశ్నిస్తాడు” అనేది ఈ కథలో సారంశం అని చెప్పాడు జేమ్స్ ఇది అంతా తన కెమెరా లో రికార్డ్ చేస్తూ ఉన్న చందన చివరకు చప్పట్లు కొడుతూ ముందుకు వచ్చింది.

“వావ్ అంకుల్ మీతో మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ జేసెస్ తో మాట్లాడినట్లు ఉంది కాస్త మీ పక్కన ఉన్న ఈ పాపిని క్షమించండి ” అని శేఖర్ వైపు చేయి చూపించింది దాంతో శేఖర్ చందన పైకి లేస్తే చందన శేఖర్ రూమ్ లోకి పరిగెత్తుతూ వెళ్లింది శేఖర్ కూడా చందన చేయి పట్టుకొని లాగాడు తను వచ్చి శేఖర్ మీద పడింది అప్పుడు ఇద్దరు బెడ్ మీద పడ్డారు అప్పుడు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటు ఉన్నారు అలా చందన శేఖర్ మీదకు వచ్చి ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసింది శేఖర్ కూడా కొంచెం ముందుకు జరిగాడు అప్పుడే తలుపు దగ్గర చప్పుడు అయితే ఇద్దరూ సర్దుకున్నారు కరెంట్ పోవడంతో ఎవరో వాళ్లు కనిపించలేదు కాకపోతే కాలి చప్పుడు బట్టి ఒక అమ్మాయి అబ్బాయి అని తెలిసింది దాంతో కింద స్కూల్ పిల్లలు రొమాన్స్ చేస్తున్నారు అని అనుకున్నాడు కాకపోతే అప్పుడే ఆ ప్రొడ్యూసర్ perfume వాసన శేఖర్ ముక్కుకు బలంగా తగిలింది అంటే స్కూల్ లో ఉండే పిల్లల్లో ఎవరో ఆ కుక్క కీ ట్రైనింగ్ ఇచ్చారు అని అర్థం అయ్యింది వెంటనే కిందకి వెళ్లి అబ్బాయిలు అందరినీ చెక్ చేశాడు కానీ ఎవరో తెలియలేదు అప్పుడు చందన అడిగింది “ఆ బ్రాండ్ బయట దొరకడం చాలా తేలిక ఏమో ఎవరైనా కామన్ గా వాడుతున్నారు ఏమో” అని అంది దాంతో శేఖర్ “అది మామూలు perfume కాదు sauvage దాని తక్కువ ధరే పదిహేను వేలు ఉంటుంది వీలు ఏదో చిన్నా చితక పనులు చేసుకొని ఫ్రీ గా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఇంత తేలికగా వీలకు దొరికింది అంటే వాళ్లు ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్ ఇంట్లో ఏదో ఒక పని చేస్తుండే వాళ్లే” అని అన్నాడు.

ఆ మరుసటి రోజు ఉదయం ఎవరికి తెలియకుండా స్కూల్ లో నుంచి ఒక పెట్టుడు మీసం దొంగలించి షాపింగ్ కీ వెళ్లి ఒక ఫార్మల్ డ్రస్ కొనుక్కున్ని తన ఫ్రెండ్ శ్రీ కృష్ణ కీ ఫోన్ చేశాడు, శ్రీ కృష్ణ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన జీప్ తీసుకోని డ్రైవర్ లేకుండా రమ్మని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి DK రావు ఇంటికి వెళ్లారు సినిమా వాళ్ళు వస్తారు కాబట్టి సెక్యూరిటీ గట్టిగా ఉంది అక్కడ “రేయ్ ఇక్కడికి ఎందుకు తీసుకోని వచ్చావు నాకూ ఇక్కడ డ్యూటీ లేదు పైగా ఇది మా ఏరియా కిందకి కూడా రాదు” అన్నాడు కృష్ణ కానీ శేఖర్ ఇది ఏమీ పట్టించుకోకుండా అక్కడ నిలబడి ఉన్న ఒక కానిస్టేబుల్ లాటి తీసుకోని కావాలి అని అక్కడ ఉన్న జనం లో ఇద్దరు ముగ్గురు నీ కొట్టాడు దాంతో కానిస్టేబుల్స్ కొంచెం భయపడి పరుగు మీద వచ్చారు “ఏమయ్యా బుద్ధి ఉందా లేదా ఇక్కడ ఇంత మంది కంట్రోల్ లేకుండా ఉంటే ఏమీ చేస్తున్నారు మొత్తం బెటాలియన్ ట్రాన్స్ఫర్ చేయిస్తా నరసింహారావు ఐపిఎస్ లోపల మా బావ చనిపోయాడు బయట ఏంటి న్యూసెన్స్” అని అరిచి లోపలికి వెళ్ళాడు శేఖర్ తన వెనకే కృష్ణ కూడా లోపలికి వెళ్ళాడు.

కృష్ణ : ఏంటి మామ అలా అరిచావు

శేఖర్ : భయపడవా మామ

కృష్ణ : అవును మామ

శేఖర్ : నేను అరిచిన అరుపుకీ నాకే పాంట్ తడిచిపోయింది రా

కృష్ణ : అసలు ఏమీ చేస్తున్నావురా ఇక్కడ

దాంతో శేఖర్ మొత్తం చెప్పాడు “బాబు షేరలాక్ హోల్మ్స్ నను లాగోదు ఇలాంటి వాటికి” అన్నాడు కృష్ణ దానికి శేఖర్ “షేరలాక్ కీ కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ coward సహాయం కావాలి రా” అన్నాడు, “వాడు ఎవడు రా” అని అడిగాడు కృష్ణ “షేరలాక్ పట్టుకుంటాడు వాడు క్రెడిట్ తీసుకుంటాడు” అని అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఓహ్ తెగ ఊహించుకోని సరే సహాయం చేస్తా అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్లి కొంచెం ఇళ్లు చెక్ చేయాలి అని చెప్పి లోపలికి వెళ్లి అంతా వెతికారు 19,20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు ఒక్కడు కూడా లేడు దాంతో బయటికి వస్తుంటే పని అమ్మాయి కీ పొరపాటు గా డాష్ ఇచ్చాడు కృష్ణ తన చున్ని లో దాచుకొన్ని వెళ్లుతున్న perfume బాటిల్ కింద పడి పగిలింది అది చూసి శేఖర్ తనని ఆగమని చెప్తే తను పారిపోయింది దాంతో తను మెట్లు దిగి వెళ్లుతుంటే శేఖర్ ఒకేసారి పై నుంచి కిందకు దూకి తనని పట్టుకొని వెనుక డోర్ నుంచి జీప్ దగ్గరికి తీసుకోని వెళ్లాడు, అప్పుడు తనని అడిగితే ఆ ప్రొడ్యూసర్ రోజు అసభ్యంగా ప్రవర్తించేవాడు అని అందుకే వాళ్ల ఇంటి కుక్క నీ వాకింగ్ కీ తీసుకోని వెళ్లినప్పుడు ట్రైనింగ్ ఇచ్చి అలా చేశాను అని చెప్పింది కానీ శేఖర్ నమ్మలేదు. అప్పుడే ఇంటి ముందు ఏదో గొడవ జరిగిందని అక్కడికి చూడ్డానికి వెళ్లారు కృష్ణ, శేఖర్ ఒక స్టార్ హీరో సడన్ గా పడిపోతే ఫ్యాన్స్ హడావిడి చేశారు దాంతో వీలు తిరిగి జీప్ దగ్గరికి వచ్చే సరికి ఆ అమ్మాయి లేదు సీట్ లో “ఇక్కడి తో వదిలేయి” అని రాసిన ఒక పేపర్ కనిపించింది.

శేఖర్ నుంచీ ఆ అమ్మాయిని ఒక అబ్బాయి తప్పించాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని ట్యాంక్ బంద్ మీద దించి “దివ్య నువ్వు నర్స్ డ్రస్ వేసుకుని రెడీగా ఉండు ఒక గంట తరువాత టివి లో ఏ హాస్పిటల్ అని చెప్తారు అప్పుడు అక్కడికి వెళ్లు నేను మిగిలిన విషయాలు అని మెసేజ్ చేస్తా” అని చెప్పి వెళ్లిపోయాడు.

రూమ్ లో ఉన్న శేఖర్ ఆలోచిస్తున్నాడు అసలు ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అని అప్పుడు కృష్ణ తో “మామ నువ్వు తనకు బేడీలు వేసే ఉంచావా” అని అడిగాడు దానికి కృష్ణ అవును అన్నట్లు తల ఊప్పాడు అయిన ఎలా తప్పించుకుంది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో కృష్ణ “మామ అసలు ఏమీ జరిగిందంటే నా పెళ్లాం నుంచి ఫోన్ వస్తే పొరపాటుగా తాళాలు జీప్ లో వదిలేశారా అందుకే ఆ పిల్ల తప్పించుకున్నట్లు ఉంది” అని అన్నాడు దానికి శేఖర్ కృష్ణ వైపు చూసి తన షూ తీసి విసిరేసాడు ఇంకో షూ తీస్తూ “నీ అబ్బ ఎవరు రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది పెళ్లాం కీ భయపడే పిరికి నా కోడక” అని అన్నాడు దానికి కృష్ణ “నీ అబ్బే రా నాకూ ఉద్యోగం ఇచ్చింది” అన్నాడు “నా అబ్బ జోలికి వస్తే నీ అబ్బ గోయి పక్కన నీ గొయ్యి తిస్తా” అని అన్నాడు శేఖర్ “రేయ్ పెళ్లాం ఫోన్ చేస్తే ci ఏంటి సిఎం కీ అయిన పాంట్ లో వట్టలు షేక్ అవుతాయి” అన్నాడు కృష్ణ దానికి శేఖర్ “మరి నా బొచ్చెడు గర్ల్ ఫ్రెండ్స్ నీ వాడుకున్నా నాకూ ఎప్పుడు షేక్ అవ్వలేదే” అన్నాడు “బాబు నీది కామం నాది ప్రేమ ” అన్నాడు కృష్ణ తన రెండో షూ కూడా తీసుకోని కృష్ణ మీదకీ విసురుతూ కిందకి వచ్చాడు అప్పుడే స్కూల్ లో ఏదో మ్యూజిక్ వస్తుంటే లోపలికి వెళ్ళాడు.

అక్కడ థామస్ తనకి ఇచ్చిన చర్చి ఫాదర్ పాత్ర కాకుండా ఏదో రాజు లాగా వేషం వేసుకుని స్టేజీ పైకి ఎక్కి

” So finally this is the moment Beckett,

I am glad to your visit to England after these long years,

But you never forget that this England will be mine forever and ever,

You are just a piece of this puzzle game but the end is mine,

Maybe you are light but your light is weak in front of my darkness,

The fate of you has been not written by the law of your God but it’s a devil play,

You are a good man brother you are a true friend but there is end for everything,

You won’t deserve this world brother just rest in paradise” అని తన డైలాగ్ పూర్తి చేసి తన డ్రస్ లో ఉన్న కత్తి తీసుకోని కిందకి వంగి పొడిచి బీకరంగా నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే లోపలికి వచ్చిన జేమ్స్ థామస్ చేస్తున్న ప్రఫార్మేన్స్ చూసి గట్టిగా థామస్ అని పిలిచాడు దాంతో థామస్ భయపడ్డాడు జేమ్స్ స్టేజీ పైకి ఎక్కి తను వేసుకున్న డ్రస్ లాగేసి.

“ఎన్ని సార్లు చెప్పినా విన్నవా నువ్వు చేయాల్సింది థామస్ బేకెట్ కారెక్టర్ లార్డ్ హెన్రీ కాదు ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ విలన్ పాత్ర నే ఎందుకు చేస్తా అంటున్నావూ” అని కోపంగా అన్నాడు జేమ్స్, “నాకూ ఆ విలన్ కారెక్టర్ నచ్చింది అందుకే అదే చేస్తా నాకూ అదే ఇష్టం విలన్ గా చేయడమే నాకూ ఇష్టం ” అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు థామస్ దాంతో శేఖర్ జేమ్స్ దగ్గరికి వచ్చి “సార్ మీ అబ్బాయి లో టాలెంట్ ఉంది దానికి తోడు తనకి హీరో కంటే విలన్ పాత్ర బాగా సెట్ అయ్యింది పిల్లలకు ఏది నచ్చితే అదే జరిగేలా చేయాలి సార్ పైగా మీ అబ్బాయి విలన్ గా నటిస్తున్నప్పుడు ఒక naturality కనిపించింది 1990 లో ఒక విలన్ ఉండే వాడు హా దేవరాజ్ కన్నన్ ఆయన లాగే అనిపించాడు ” అని శేఖర్ మాట పూర్తి కాక ముందే జేమ్స్ శేఖర్ నీ లాగి కొట్టి “నా కొడుకు నీ ఎలా తయారు చేయాలో ఎలా ఉండాలో నువ్వు నాకూ చెప్పకర్లేదు ” అని వెళ్లిపోయాడు, ఆ తర్వాత శేఖర్ చుట్టూ చూసి “ఎవరూ చూడలేదు ఏమీ పర్లేదు “అని అనుకుంటు తన రూమ్ లోకి వెళ్ళాడు.

అప్పుడే టివి లో డిఎస్పి ఏదో మాట్లాడుతూ ఉంటే అతని చూడగానే శేఖర్ కీ తన గతం కళ్ల ముందు కదిలింది “మీ జేన్నాన ఐపిఎస్, నేను ఐపిఎస్ నువ్వు కూడా అదే దారిలో రావాలి అంతగా నీకు డిటెక్టివ్ అవ్వాలి అని ఉంటే అది ఏదో పోలీస్ డిపార్టుమెంట్ నుంచి అవ్వోచ్చు కదా చూడు చిన్న నాకూ ఉన్న ఒకటే ఆశ మన కుటుంబం ఎప్పుడు ఈ ఐపిఎస్ చైన్ నీ విడిచి పెట్టకుడదు” అని అన్నాడు దానికి శేఖర్ “మీ కొడుకు ఐపిఎస్ సాధించలేక పోయాడు అనే దానికంటే ఏదో ఒకటి సక్సెస్ ఫుల్ గా చేస్తున్నాడు అని అందరూ మెచ్చుకుంటే సరిపోదా “అని శేఖర్ అన్న మాట కీ వాళ్ల నాన్న రామచంద్ర లాగి కొట్టాడు దాంతో శేఖర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా ఏజెన్సీ పెట్టాడు కాకపోతే ఈ కేసు కంటే ముందు తను పూర్తి చేసిన కేసు వల్ల తను కొన్ని నెలలు జైలులో ఉన్నాడు, ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి అంతా మారిపోయింది అప్పుల పాలు అయ్యి కేసు లేక అజ్ఞాతం లో ఉన్నాడు.

అలా తన గతం గురించి తలచుకొని మళ్లీ టివి చూస్తే అక్కడ ఒక స్టార్ హీరో హాస్పిటల్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చేర్చారు అని న్యూస్ వస్తే చూస్తూ ఉన్నాడు ఆ హీరో ప్రొడ్యూసర్ ఇంటి ముందు పడిపోవడం చూసిన శేఖర్ ఏదో తప్పు జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండగా అతను హాస్పిటల్ ఉన్న ఫోటో వచ్చింది అతని చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన వాడిలా అనిపించడం లేదు శేఖర్ కీ మొత్తం శరీరమంతా బిగుసుకొని ఉంది దాంతో వెంటనే కృష్ణ కీ ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇద్దరు హాస్పిటల్ కీ బయలుదేరారు YouTube లో ఆ న్యూస్ చూస్తూ ఉండగా ఆ ఫోటో జూమ్ చేసి చూస్తే ఆ హీరో మెడ నుంచి బుజం దెగ్గర ఉండే ఎముక పైన నల్లగా మారి ఉంది.

శేఖర్ ఆ మెడ పైన ఉన్న మచ్చ నీ ఎక్కడో చూశాడు కానీ ఎక్కడ చూశాడు అన్న విషయం గుర్తుకు రావడం లేదు అప్పుడు జీప్ ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగితే పక్కన పార్క్ లో చిన్న పిల్లలు కరాటే చేస్తున్నారు అది చూసి శేఖర్ ఆ ఫోటో వైపు చూసి “మామ నీకు తెలిసిన ఏదైన సినిమా సిడి షాప్ ఉందా” అని అడిగాడు దానికి కృష్ణ తెలుసు అన్నట్టు తల ఆడించాడు అక్కడికి తీసుకోని వేళ్లు అని అడిగాడు “కానీ మామ మనం హాస్పిటల్ కీ వెళ్లాలి కదా” అని అడిగాడు కృష్ణ “పర్లేదు మనం టైమ్ కీ వెళ్లిపోవచ్చు” అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఒక కాంప్లెక్స్ లో ఒక మొబైల్ షాప్ కీ తీసుకోని వెళ్లాడు కృష్ణ నీ చూడగానే అక్కడ కుర్రాడు నమస్తే పెట్టాడు “ఏంటి సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు ” అన్నాడు దాంతో కృష్ణ శేఖర్ నీ పరిచయం చేసాడు అప్పుడు శేఖర్ “నీ దెగ్గర బ్రూస్ లీ, జాకీ చాన్, ఫిన్ జోనస్ సినిమా కలెక్షన్స్ ఉన్నాయా” అని అడిగాడు దానికి ఆ కుర్రాడు బ్రూస్ లీ, జాకీ చాన్ సినిమాలు ఉన్నాయి కానీ మూడో హీరో సినిమాలు లేవు అని చెప్పాడు దాంతో శేఖర్ మూడు సినిమా పేర్లు రాసి ఇచ్చి తొందరగా అవి మూడు డౌన్లోడ్ చేసి ఇవ్వమని చెప్పి చందన కీ మెసేజ్ చేశాడు హీరో రవి కిషోర్ ఏ బ్లాక్ లో ఉన్నాడో చూసి వచ్చి పోయే డాక్టర్ నర్స్ పైన కన్ను వేసి ఉంచాడూ ఆ సిడి షాప్ కుర్రాడు డార్క్ నెట్ సహాయం తో ఆ సినిమాలు డౌన్లోడ్ చేశాడు.

శేఖర్ ముందు ఆ మూడు సినిమాలో ఫైట్ సీన్స్ మర్డర్ సీన్స్ చూశాడు ఆ తర్వాత ఒక సినిమా చూసి అక్కడ ఆ సీన్ హోల్డ్ లో పెట్టి YouTube లో వచ్చిన ఫోటో చూసి తను కన్ఫర్మేషన్ చేసుకున్నాడు ఇది ఆ సినిమా లో వాడిన టెక్నిక్ అని దాంతో ఇద్దరు హాస్పిటల్ కీ బయలుదేరారు దారిలో కృష్ణ అడిగాడు “ఇప్పుడు అంత అవసరం ఏమీ ఉంది సినిమా చూడడానికి” అని అన్నాడు అప్పుడు శేఖర్ “కరాటే, కుంగ్ పూ ఇవి అని ఆత్మ రక్షణ కళలు అంటారు కానీ ఇవి ఒక విధమైన ప్రాచీనమైన యుద్ధ కళ మన దేశంలో కళల్రీపట్టు, అడిమురై అని కూడా అంటారు ఇవి ఆయుధాలు లేకున్నా శత్రువులను చంపడం కోసం తయారు చేసిన ఒక యుద్ధ కళ ఇట్టు చూడు ఎంటర్ ది డ్రాగన్ లో బ్రూస్ లీ తన అరచేతిని పంజా లా మార్చి వాడి చాత్తి మీద కోడితే వాడి గుండె ఆగి పోయింది, అలాగే ఇక్కడ ఇంకో సినిమా స్నేక్ ఇన్ ఈగల్ షాడో జాకీ చాన్ సినిమాలో తన రెండు చేతులతో పంజా లాగా మార్చి తల మీద కోడితే తల లో నరాలు చితికి చనిపోయాడు, అలాగే ఇక్కడ చూడు ఐరన్ ఫీస్ట్ ఈ సినిమా లో హీరో తమ్ముడు హీరో కు ఉన్న సూపర్ హీరో పవర్ కోసం అడ్డు ఉన్నాడు అని తన తండ్రి నీ మెడ దెగ్గర గిలి హార్ట్ ఎటాక్ తెప్పించాడు ఇలాంటి టెక్నిక్ నే ఇప్పుడు వాడు ఎవడో హీరో రవి కిషోర్ మీద ప్రయోగించాడు” అని చెప్పారు శేఖర్ దానికి కృష్ణ “అసలు ఈ రోజుల్లో కళల్రీపట్టు ఎవరూ నేర్పీస్తారు అయిన ” అని అడిగాడు “కేరళ లో ఇంకా కొన్ని చోట్ల అల్లిపి, పాల్కడ్ జిల్లాలో ఇంకా ఈ ఆచారం కాపాడుతున్నారు ” అని చెప్పాడు.

శేఖర్ ఇద్దరు హాస్పిటల్ కీ వెళ్లారు చూస్తే సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది పైగా శేఖర్ వాళ్ల నాన్న కూడా ఉన్నాడు దాంతో శేఖర్ కృష్ణ తో యునిఫామ్ కాకుండా వేరే డ్రస్ ఉందా అని అడిగాడు లోపల ఒక షర్ట్ ఉంది అన్నాడు దాంతో డ్రస్ మార్చుకొ అని చెప్పాడు కృష్ణ డ్రస్ మార్చుకొని రాగానే ముక్కు మీద గుద్దాడు శేఖర్, కృష్ణ అలా మబ్బులో లో ఉండగానే లోపలికి తీసుకోని వెళ్లాడు అప్పుడు శేఖర్ వాళ్ల నాన్న ఎమైంది అని అడిగాడు దానికి శేఖర్ “చట్నీ లో ఉప్పు తక్కువ అయ్యింది అని వాళ్ల ఆవిడ మీద అరిచాడు ఆమె లోపలి నుంచి చలాకీ విసిరేసింది” అన్నాడు అది విని కృష్ణ శేఖర్ వైపు కోపంగా చూశాడు, కృష్ణ నీ ఫస్ట్ ఎయిడ్ రూమ్ లో కూర్చోబేటీ చందన కీ ఫోన్ చేసి తన దగ్గరికీ వెళ్లాడు అప్పుడే ఆపరేషన్ రూమ్ లో కొన్ని సర్జరీ డ్రస్ కనిపిస్తే ఒకటి వేసుకొని వెళ్లాడు చందన తో కలిసి రవి కిశోర్ రూమ్ దగ్గరికి వెళ్లుతు డాక్టర్ నీ తన తండ్రిని చూసి ఆగ్గారు “వాడికి ఎప్పటి నుంచో చెప్తున్నా సిగరెట్ మానేయి అని కానీ వాడు వినలేదు అందుకే హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ఉంది” అని అన్నాడు డాక్టర్ అతను హీరో కీ పర్సనల్ డాక్టర్ అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అలా వాళ్లు వెళ్లి పోయాక ఇద్దరు రూమ్ లోకి వెళ్లారు చూస్తే కళ్లు తప్ప ఇంక ఏమీ కదలడం లేదు దాంతో మెడ దెగ్గర చూస్తే ఆ నల్ల మచ్చ ఇంకా పెరిగింది అప్పుడే డోర్ తీసుకోని ఒక నర్స్ లోపలికి వచ్చింది తనని చూశాడు శేఖర్ ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ ఇంట్లో పని మనిషి, ఆ అమ్మాయి శేఖర్ నీ చూసి పారిపోయింది తనని వెంబడించాడు అలా ఆ అమ్మాయి పారిపోతు ఒక బిల్డింగ్ పైకి ఎక్కిందీ శేఖర్ కూడా తన వెనుక రాగానే తన చేతిలో ఉన్న రిమోట్ తో బటన్ క్లిక్ చేసింది అప్పుడే చందన వెనుక నుంచి వచ్చి శేఖర్ నీ పిలిస్తే వెనక్కి తిరిగాడు తన వైపు వచ్చిన బుల్లెట్ తను పక్కకు జరగడంతో వెళ్లి దివ్య కీ తగిలింది ఆ తర్వాత తన ఫోన్ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయారు చందన, శేఖర్ ఇద్దరు.

జేమ్స్ తన బీరువా లో ఉన్న పాత ఆల్బం ఒకటి తీసి అందులో దేవరాజ్ ఫోటో చూసి “వాడి పేరు మార్చిన, వాడి మతం మార్చిన వాడి రక్తం నీదే కదా రా” అని అన్నాడు థామస్ స్మశానం లో దేవరాజ్ సమాధి ముందు కేక్ పట్టుకొని నిలబడి “హ్యాపీ బర్త్ డే అప్ప” అని అన్నాడు.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000