ఖర్కోటఖుడు – Part 6

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

మల్హోత్రా ఎదురుగా రిచర్డ్స్ నిలబడి ఉన్నాడు. రిచర్డ్స్ ని చూడగానే మల్హోత్రా కళ్ళలో చావుభయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బీపీ డౌన్ అయిపోయింది. వొళ్ళంతా చెమట్లు పట్టేసాయి. కదలకుండా శిలా విగ్రహంలా ఉండిపోయాడు.

“మల్హోత్రా.. ఏమైంది?” అంటూ రిచర్డ్స్ కుదిపిన కుదుపుతో “ఎ.. ఎ.. ఏం లేదు సర్. జస్ట్ ఎ నైట్ మేర్” అంటూ పక్కనున్న మంచినీళ్ళ గ్లాసు తీసుకుని గటగటా తాగేసాడు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు. “ఏమైంది mr మల్హోత్రా? ఈజ్ ఎవ్రిథింగ్ ఆల్ రైట్?” అడిగాడు రిచర్డ్స్. “హా ఓకే సర్. నథింగ్ టు వర్రీ” “మన ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది?” “అయిపోతుంది సర్. చిన్న టెక్నికల్ డిఫికల్టీ ఉంది. క్లియర్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది.” “మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా మీరు కోరుకున్న స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. దానితో పాటు మీరు ఊహించని ఒక బహుమతి కూడా మీ కోసం సిద్ధంగా ఉంది” ఆ బహుమతి ఏంటో తలుచుకోగానే మల్హోత్రా గుండెల్లో గుబులు మొదలైంది. వెర్రి నవ్వు ఒకటి నవ్వి అక్కడి నుంచి తన ప్రాజెక్ట్ వైపు నడుస్తున్నాడు. మల్హోత్రా గుండెల్లో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. తను ఎంత అమాయకంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాడు. తన కష్టానికి అతనికి లభించే జీతం మరణం. ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించుకునే దారుల కోసం వెతుకుతున్నాడు. నరకకూపం లాంటి ఆ ల్యాబ్ లో క్షణమొక యుగంలా గడుస్తుంది. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎప్పటిలాగే వాకింగ్ కి వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో చాలా స్థబ్దుగా అనిపించింది. చిరాకు అనిపించి అక్కడే ఉన్న ఒక బల్లపై కూర్చున్నాడు. “వాట్ mr. మల్హోత్రా? చాలా డల్ గా ఉన్నారు. ఎనీ ప్రాబ్లం?” అన్న మాటలకు తలెత్తి చూసిన మల్హోత్రా ఎదురుగా సౌరవ్ ఠాగూర్ నిలబడి ఉన్నాడు. సౌరవ్ ఠాగూర్ ఇక్కడే ఒక పెద్ద వ్యాపారవేత్త. మల్హోత్రాని తన కంపెనీస్ అన్నిటికీ టెక్నికల్ హెడ్ గా ఉండమని అదిరిపోయే ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసాడు కూడా. కానీ మల్హోత్రా కళ్ళు రిచర్డ్స్ ఇచ్చే ఆఫర్ కి బైర్లు కమ్మేసి ఠాగూర్ ని తిరస్కరించాడు. అయినా రోజూ మల్హోత్రాని మామూలుగానే పలకరిస్తాడు. ఠాగూర్ ని చూడగానే మల్హోత్రా బుర్రలో ఆలోచనలు బైనరీ లాంగ్వేజ్ లోకి మారిపోయి ఏదో ప్రోగ్రాంలా తయారయ్యాయి. అన్నీ కలిసి చెప్పిన మాట ఒక్కటే ” నీ ప్రాబ్లంకి ఏకైక సొల్యూషన్ ఠాగూర్ మాత్రమే” అని. మల్హోత్రా అలా బిగుసుకుపోయి ఉండటం వల్ల ఠాగూర్ కి ఏం జరిగిందో అర్ధం కాక ముందుకు వెళ్లిపోతున్న వాడల్లా “mr. సౌరవ్..” అన్న మల్హోత్రా పిలుపుతో “యెస్.. చెప్పండి” అంటూ వెనక్కి వచ్చాడు. “మీరు ఏమీ అనుకోకపొతే రేపు ఒక అరగంట ఎర్లీగా వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు మల్హోత్రా. సౌరవ్ కి ఏదో ఉంది అనిపించి “క్యాచ్ యూ ఎట్ 4.30 pm” అంటూ ముందుకు సాగిపోయాడు. మల్హోత్రాకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. రాత్రి బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. ఉదయం లేవగానే తయారయ్యి ల్యాబ్ కి వచ్చి తాను అనుకున్న విధంగా ఏం చేయాలో ఆ పని మొత్తం చకచకా చేసుకుపోతున్నాడు. ల్యాబ్ లో అందరూ మల్హోత్రాని వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మల్హోత్రా ఉత్సాహంగా, నీరసంగా పనిచేశాడు కానీ ఇప్పుడు టెన్షన్ తో పని చేస్తున్నాడు. అసిస్టెంట్ లతో చేయించే పనులు కూడా తనే చేసుకుంటున్నాడు. 4గంటలకి ల్యాబ్ నుంచి బయటకు వచ్చాడు. తనకు కావలిసిన వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ ఒకటి అక్కడి నుంచి మెల్లిగా తీసుకొచ్చేసాడు. 4.20 నుంచి పార్క్ లో ఠాగూర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఠాగూర్ ఠంచనుగా 4.30 కి అక్కడ ఉన్నాడు. “హ్మ్మ్.. ఇప్పుడు చెప్పండి మల్హోత్రా. ఏం మాట్లాడాలి నాతో?” అన్నాడు సాలోచనగా. “ఇక్కడ వద్దు సర్. జాగ్ చేస్తూ మాట్లాడుకుందాం రండి” అంటూ లేచి జాగింగ్ మొదలెట్టాడు మల్హోత్రా. ఠాగూర్ అతణ్ణి వెంబడించసాగాడు.

“మీకొక విషయం చెప్పాలి ఠాగూర్. కానీ అది బయటకి తెలిస్తే నా ప్రాణమే పోతుంది. కానీ ఇప్పుడు తప్పట్లేదు. దానికి మీరు మాత్రమే అర్హులు అందుకే చెప్తున్నాను” అంటూ మొదలుపెట్టాడు మల్హోత్రా. “ఇంతకూ మీరు చెప్పేది దేని గురించి?” అర్ధం కాక అడిగాడు సౌరవ్. “రిచర్డ్స్ నా చేత ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చెయ్యిస్తున్నాడు.” అంటూ మొత్తం కథ చెప్పేసాడు మల్హోత్రా. “వ్వాట్? టైం మెషిన్ ఆహ్? నాన్సెన్స్. ఇది చెప్పడానికి నేనే దొరికాన?” అంటూ మల్హోత్రా చెప్పింది వినగానే ఎర్రి పూకుని చెయ్యడానికి ఇంకెవరూ దొరకలేదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టాడు సౌరవ్. “నేను చెప్పేది నిజం సర్” ఎలా నమ్మించాలో అర్ధం కాక అయోమయంగా ఉంది మల్హోత్రాకి. “ప్లీజ్ సర్. నాన్సెన్స్ మాట్లాడకండి. మీ నోటి నుంచి ఈ మాటలు వినడానికి చాలా ఫన్నీగా ఉంది. నేనింకా రిచర్డ్స్ బిజినెస్ సీక్రెట్ ఏమైనా చెప్తారేమో అని ఆశగా వచ్చాను” అన్నాడు ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నట్టు సౌరవ్. “మీరు నమ్మరని నాకు తెలుసు mr. సౌరవ్. ఈ పెన్ డ్రైవ్ చెక్ చేసి డీల్ ఆర్ నో డీల్ అనేది రేపు సేమ్ టైం కి చెప్పండి” అని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు మల్హోత్రా..

ఆ రాత్రి మల్హోత్రాకి నిద్ర పట్టలేదు. సౌరవ్ ఏం చెప్తాడో అని భయంగా ఉంది. ఇక్కడ సౌరవ్ కూడా అలాగే ఉన్నాడు. పెన్ డ్రైవ్ ఓపెన్ చేసాక అతనిలో ఏవేవో ఆలోచనలు పురుడు పోసుకున్నాయ్. కళ్ళు మూసినా తెరిచినా అందులో అతనికి ఆ టైం మెషీన్ బ్లూ ప్రింట్ మాత్రమే కనిపిస్తుంది. అంతలా అతని ఆలోచనల్లో జీర్ణం అయిపోయింది ఆ విషయం. మర్రోజు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూడసాగాయి ఆ రెండు ప్రాణాలు. ప్రేమికుల కన్నా దారుణంగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం నాలుగు కొట్టింది గడియారం అంతే ఇద్దరూ పార్కులో ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరూ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నారు. సౌరవ్ డీల్ అన్నట్టు తన బొటన వేలితో పైకి చూపించాడు. వెంటనే మల్హోత్రా పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది. ఇద్దరూ కలుసుకోగానే ” ఐయాం విత్ యూ మల్హోత్రా. ఏం చేద్దాం” అన్నాడు సౌరవ్. “నన్ను ఇక్కడి నుంచి బయట పడేయ్యండి. అది మీకు నేను ఫ్రీ అఫ్ కాస్ట్ చేసి పెడతాను” అన్నాడు మల్హోత్రా బతికితే చాలు అనే ఉద్దేశంతో. “ఓకే థెన్ మీరు ఇండియాకి వెళ్ళిపోండి. అక్కడ నేను మీకు కావలిసిన టోటల్ ఎరేంజ్ మెంట్స్ చేసి ఉంచుతాను” “కానీ రిచర్డ్స్ కి నేను ఏం చెప్పాలి?” “దట్స్ నన్ అఫ్ మై బిజినెస్ mr. మల్హోత్రా. బయటకి వస్తే డీల్” “ఓకే బట్ నేను ఇప్పుడు ఏదొకటి మేనేజ్ చేస్తాను. కానీ తర్వాత నా సెక్యూరిటీ మీ భాధ్యత” “i’m in” అన్నాడు సౌరవ్ నడుస్తూ. మల్హోత్రా ఆ రాత్రి నిద్రపోలేదు. ఆలోచిస్తున్నాడు.. ఆలోచిస్తున్నాడు. బుర్ర పగిలిపోతుంది. ఇండియాకి ఎలా వెళ్ళాలి. అప్పటికే పెట్టె ఖాళీ చేసాడు. ఇంకో సిగరెట్ కాల్చాలి అంటే నోరు సహకరించలేదు. అందులోనూ బుర్ర బద్దలుకొట్టే తలనొప్పి ఒకటి. ఐస్ ప్యాక్ తీసి నుదురుకి ఆన్చాడు. బుర్రలో ఎక్కడో మూల చిన్నగా స్ట్రైక్ అవుతుంది కానీ పూర్తి స్థాయిలో మ్యాప్ రెడీ అవ్వట్లేదు. దానినే డెవలప్ చేసుకుంటూ ఆ రాత్రి నిద్రపోయాడు. పొద్దున్న లేస్తూనే రెడీ అయ్యి రిచర్డ్స్ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. రిచర్డ్స్ రావడంతోనే అతని ఛాంబర్ లో దూరేసాడు. ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని పరిస్థితిలో అసహనంగా నిలబడ్డ మల్హోత్రాని గమనిస్తూ “చెప్పండి” అన్నాడు రిచర్డ్స్. “సర్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పూర్తయ్యే అవకాశాలు లేవు సర్” ప్రాణభయం తెచ్చిన ధైర్యంతో ధృఢంగానే చెప్పాడు మల్హోత్రా. “వాట్ యూ మీన్?” “ఐ మీన్ ఇక్కడ ఇది నా ఒక్కడి వల్ల పూర్తయ్యే విషయం కాదు సర్.” “అయితే మీకు కావలిసిన వాళ్ళని వాళ్ళకు కావలిసినంత ఇస్తాను రమ్మనండి” విషపు సర్పంలా నవ్వాడు రిచర్డ్స్. దాని వెనకున్న క్రూరత్వానికి మల్హోత్రా ఒళ్ళు జలదరించింది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000